మీ కుటుంబ సభ్యులకు ఫోన్ బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయ్యాల్సి వచ్చిందా...?, సహాయం కోరే అవతలి వ్యక్తి కూడా మీ నెట్‌వర్క్‌లోనే ఉన్నారా..?. అయితే ఇంకేం.. సులుభమైన సూచనలను అనుసరించి మీ మిత్రునికి మీ మొబైల్ ద్వారానే టాక్‌టైమ్‌ను షేర్ చేయవచ్చు. అది ఎలానో చూ డండి ... ఎయిర్‌టెల్ (Airtel): మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే *141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఐడియా (IDEA): మీరు ఐడియా కస్టమర్ అయితే *567*అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ * ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్# ఉదాహరణకు: *567*98489xxxxx *50#
బీఎస్ఎన్ఎల్ (BSNL): మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే GIFT అని టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ టైప్ చేయండి కొద్ది స్పేస్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేసి 53733కు ఎస్ఎంఎస్ చేయండి. ఉదాహరణకు : GIFT 9414094140 50 and sent to 53733
టాటా డొకోమో (Tata Docomo): మీరు టాటా డొకోమో కస్టమర్ అయితే BT టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ టైప్ చేయండి కొద్ది స్పేస్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేసి 54321కు ఎస్ఎంఎస్ చేయండి. ఉదాహరణకు : BT 9000090000 30 and Sent to 54321
రిలయన్స్ (Reliance) రిలయన్స్ (Reliance) మీరు రిలయన్స్ కస్టమర్ అయితే ముందుగా మీ మొబైల్ నుంచి *367*3#కు డయల్ చేయండి. ఆ తరువాత *312*3#కు డయల్ చేయండి. తరువాతి సూచనలను అనుసరిస్తూ అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్‌ను టైప్ చేసి అమౌంట్‌ను ఎంటర్ చేయండి. ఈ పక్రియలో మిమ్మల్ని పిన్ నెంబర్ అడిగితే 1 అంకెను ప్రెస్ చేయండి.
Aircel ఎయిర్‌సెల్ (Aircel) మీరు ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే ముందుగా మీ మొబైల్ నుంచి *122*666#కు డయల్ చేయండి. తరువాతి వాయిస్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్‌తో పాటు అమౌంట్‌ను ఎంటర్ చేయండి.
ట్రై చేసి చుడండి ..
ట్రై చేసి చుడండి ..
How to mobile balance transfer ?
Reviewed by Unknown
on
03:55:00
Rating: