ఆడవారి కోసం మగవారు ఎన్నో కట్టించారు, మరి మగవారి జ్ఞాపకార్థం ఆడవారు ఏమైనా కట్టించారా అంటూ ఎంతో మంది అంటుంటారు ,మనము విని ఉంటాము .సాంగ్స్ లో కూడా చాల మంది పాటలు కూడా పడా రు . ఇప్పటి వరకు ఆడవారి ప్రేమ కోసం, వారి జ్ఞాపకార్థం మగవారే ఎన్నో కట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు అని అంతా అనుకుంటున్నారు. కాని మగవారి జ్ఞాపకార్థం, మగవారి కోసం కూడా ఆడవారు పలు కట్టడాలు కట్టించడం జరిగింది అయితే అవి పెద్దగా ఎవరికీ తెలీదు .
మగవారి జ్ఞాపకార్థం ఆడవారు కట్టించిన కొన్ని కట్టడాలు మీకోసం : ఆగ్రాలోని యమునా నది తీరంలో తాజ్ మహల్ కంటే ముందు, దాదాపు అదే ఆకారంలో ‘ఇత్మద్ ఉద్ దౌలా’ అనే కట్టడంను నూర్జహాన్ తన తండ్రి జ్ఞాపకార్థం కట్టించడం జరిగింది. ఆయన మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకు దీనిని నిర్మించింది. ఇదో అద్బుతమైన పాలరాతి కట్టడం.
హ్యుమాయున్ చనిపోవడంతో ఆయన భార్య హమీదా అతడి జ్ఞాపకార్థం ఒక పెద్ద సమాదిని నిర్మించారు. ఆ సమాధి ఇప్పటికి కూడా చాలా ఫేమస్. హ్యుమాయున్ సమాధికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారత దేశంలో మొదటి ఉద్యానవన సమాధిగా దీనికి గుర్తింపు ఉంది.
కార్ణటకలోని విరూపాక్ష దేవాలయంను ఒక స్త్రీ కట్టించింది. తన భర్త పల్లవుల సామ్రాజ్యంపై దండెత్తి విజయం సాధించినందుకు గాను విక్రమాధిత్యుడి భార్య లోకమహాదేవి విరూపాక్ష దేవాలయంను నిర్మింపజేసింది. ఈ దేవాలయంలో అద్బుతమైన శిలలు, శిల్పాలు కొలువుదీరి ఉంటాయి.
సోలంకి రాజు భీమదేవుడి జ్ఞాపకార్థం ఆయన భార్య ఉదయమతి గుజరాత్‌లో ఏడు అంతస్తుల బావి ‘రాణీ కి వావ్’ను నిర్మించడం జరిగింది. ఈ బావి అప్పట్లో కొన్ని వేల ఎకరాలకు నీటిని అందించేంది అని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రతి అంతస్తులో కూడా ఎన్నో అద్బుతమైన శిల్పాలు ఉంటాయి. దీనిని హెరిటేజ్ కట్టడంగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కర్ణాటకలోని మిర్జాన్ కోటా కూడా ఒక మహిళ కట్టించింది.
ఒక్క భారత దేశంలోనే ఆడవారు నిర్మించిన కట్టడాలు చాలా ఉన్నాయి.
మగవారి జ్ఞాపకార్థం ఆడవారు కట్టించిన కొన్ని కట్టడాలు మీకోసం : ఆగ్రాలోని యమునా నది తీరంలో తాజ్ మహల్ కంటే ముందు, దాదాపు అదే ఆకారంలో ‘ఇత్మద్ ఉద్ దౌలా’ అనే కట్టడంను నూర్జహాన్ తన తండ్రి జ్ఞాపకార్థం కట్టించడం జరిగింది. ఆయన మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకు దీనిని నిర్మించింది. ఇదో అద్బుతమైన పాలరాతి కట్టడం.
హ్యుమాయున్ చనిపోవడంతో ఆయన భార్య హమీదా అతడి జ్ఞాపకార్థం ఒక పెద్ద సమాదిని నిర్మించారు. ఆ సమాధి ఇప్పటికి కూడా చాలా ఫేమస్. హ్యుమాయున్ సమాధికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారత దేశంలో మొదటి ఉద్యానవన సమాధిగా దీనికి గుర్తింపు ఉంది.
సోలంకి రాజు భీమదేవుడి జ్ఞాపకార్థం ఆయన భార్య ఉదయమతి గుజరాత్‌లో ఏడు అంతస్తుల బావి ‘రాణీ కి వావ్’ను నిర్మించడం జరిగింది. ఈ బావి అప్పట్లో కొన్ని వేల ఎకరాలకు నీటిని అందించేంది అని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రతి అంతస్తులో కూడా ఎన్నో అద్బుతమైన శిల్పాలు ఉంటాయి. దీనిని హెరిటేజ్ కట్టడంగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కర్ణాటకలోని మిర్జాన్ కోటా కూడా ఒక మహిళ కట్టించింది.
ఒక్క భారత దేశంలోనే ఆడవారు నిర్మించిన కట్టడాలు చాలా ఉన్నాయి.
అమ్మాయిలు కూడా మగవారి కోసం ఏమి చేసారో తెలుసా ..............
Reviewed by Unknown
on
23:21:00
Rating:
Reviewed by Unknown
on
23:21:00
Rating: