నవగ్రహాలు పూజ ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహాలు గురించి చాలా మందికి సందేహాలు ఎక్కువ. ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొంతమందికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి , ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని.. పూజ చేయడానికి కూడా ఆలోచిస్తారు .                      శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..? 
అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు వైపు ఉంటుంది. కనుక సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లాలి.. అక్కడి నుంచి ఎడమవైపు నుంచి కుడివైపుకి 9 ప్రదక్షిణలు చేస్తే మంచిది. నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అలాగే ప్రదక్షిణలు చేసే సమయంలో నవగ్రహాలను తాకరాదు. ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు, మడిదుస్తులు ధరించినప్పుడే నవగ్రహాలను తాకవచ్చు.                                                                                                     కుజ దోషం ఉంటే ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఉండాల్సిందేనా ?                                                           9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత.. రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు చేయాలి. అంటే.. మొత్తం 11 ప్రదక్షిణలు చేయాలి. అందరూ ప్రదక్షిణ చేయవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొంతమందికి గ్రహదోహం ఉంటుంది. మీకున్న గ్రహదోషాన్ని బట్టి.. ఆయా గ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఇప్పుడు చూద్దాం. సూర్యుడికైతే 6, చంద్రుడి అనుగ్రహానికైతే 10, కుజ గ్రహానికి7, బుధ గ్రహానికి 17, గురు గ్రహానికి 16, శుక్రగ్రహానికి 20, శనిగ్రహానికి 19, రాహు గ్రహానికి 18, కేతు గ్రహా అనుగ్రహానికైతే 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
ఏది లేకుండా నార్మల్ గాచేయాలి  అనుకొంటే 3సార్లు  చేయవచ్చు లేదా 9గ్రహాలకి  9 సార్లు చేసిన లేదా 11,లేదా 21 లేదా ,27 ఎలా బేసి నంబర్లు వచ్చేలా  చేయడము సంప్రదాయము .
Image result for navagrahalu in telugu
నవగ్రహాలు పూజ ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలు పూజ ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలి. Reviewed by Unknown on 23:22:00 Rating: 5
Powered by Blogger.