ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోడము వలన డబ్బు బాధలు ఉండవు.

  • పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంను ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
  • మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ, కుబేరులు లేదా స్వస్థిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా..స్థిరంగా ఉంటుంది.
  • మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఇది కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది.
  • కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు.. అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్లీ నీళ్లు పట్టాలి. అలాగే.. కూజా లేదా కుండను తెరచి ఉంచకండి.. మూతపెట్టుకోవాలి.
  • మెటల్  ఫిష్  ,తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల  అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. 
  • సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో వాళ్లందరూ.. కలకాలం హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వాళ్లందరి ఆదాయం.. పెరుగుతుంది.
  • మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే.. క్యాష్ లాకర్ ఉత్తరంవైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి.. మంచి లాభాలు పొందుతారు.
  • షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల.. ఎనర్జీని ఇచ్చి.. డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది. అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు.
  • మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే.. ఈశాన్య మూలలు అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా  జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా, అందంగా ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ పెరిగి.. మంచి లాభాలు పొందుతారు.
  • చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, చెప్పులు  వంటి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు.  పేదరికం కలుగుతుంది 
  • మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ని ఎట్టిపరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు.  ఆర్థిక సమస్యలు కలుగుతుంది . 
  • మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే  పేదరికం, డిప్రెషన్ కలుగుతుంది . 
  • వాస్తుశక్తివంతమైనది. . సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను. . గ్రహించే శక్తి వాస్తుకే ఉంది.
  • ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే.. కుటుంబ సభ్యులు.. అనారోగ్యంపాలవడం, తరచుగా గొడవ పడటం, కుటుంబంలో డబ్బు సమస్యలు వస్తాయి . 
  •  ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ.. డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.ఇంటిని  శుభ్రము పెట్టుకోవాలి . 
ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోడము వలన డబ్బు బాధలు ఉండవు. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోడము  వలన డబ్బు  బాధలు ఉండవు.   Reviewed by Unknown on 05:03:00 Rating: 5
Powered by Blogger.