వెంకటేశ్వర స్వామితో పిల్లి ఎక్కడో తెలుసా ?


పొద్దుటే పిల్లి ఎదురొస్తే, నిందించుకుంటూ వెనక్కి మళ్ళుతాం. అపశకునమని భావిస్తాం. ఇది ఎప్పటి నుంచో మన పెద్దల నుంచి మనకు సంక్రమించిన సంప్రదాయం. కానీ తిరుమలేశుని తొలిగా దర్శనం చేసుకునే వారిలో పిల్లి ఉంటుందట. అంతే కాదు. నైవేద్యం అయిపోయే వరకూ ఆ పిల్లి అక్కడే తిష్ట వేస్తుందట. మరి నైవేద్యం తినేయదా..? అసలు పిల్లి అక్కడ ఏమి చేస్తుంది?
 
రాత్రి ఏకాంత సేవ తరువాత ఆలయ ద్వారం మూసేస్తారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో సుప్రభాత సేవతో సన్నిధి గొల్ల, కైంకర్యాలు నిర్వహించే అర్చకులు తలుపులు తెరుస్తారు. అసమయంలో ఓ పిల్లి కూడా వారితోపాటు ఆలయంలోకి ప్రవేశిస్తుంది. నైవేద్యం అయిపోయే వరకూ అక్కడే ఉంటుంది. 
 
అయితే స్వామికి నైవేద్యం పెట్టిన తరువాత అర్చకులు పెట్టే ప్రసాదం మాత్రమే ఆరగిస్తుంది. ఎట్టి పరిస్థితులలో పక్కనే నైవేద్యానికి సిద్ధం చేసిన ప్రసాదాలను ముట్టుకోను కూడా ముట్టుకోదట. అర్చకుల కనుసైగలతోనే అది ప్రసాదాలను స్వీకరిస్తుందే తప్ప తనంతట తాను ముట్టుకోదట. ఇలా ఇప్పటి నుంచే కాదు కొన్ని వంద ఏళ్ళ నుంచి జరుగుతోందట. 
 
ఒక పిల్లి మరణిస్తే, ఆ పిల్లి స్థానంలో మరో పిల్లి వస్తుందట. రాత్రి ఏకాంత సేవ తరువాత అర్చకులతో పాటు పిల్ల కూడా ఆలయంలోంచి బయటకు వచ్చేస్తుందట.Lord Venkateswara

వెంకటేశ్వర స్వామితో పిల్లి ఎక్కడో తెలుసా ? వెంకటేశ్వర స్వామితో పిల్లి  ఎక్కడో తెలుసా ? Reviewed by Unknown on 08:47:00 Rating: 5
Powered by Blogger.