గూగుల్ దేని వదలదు ఇపుడు ఏమి చేస్తోందో చూడండి.....

టెక్నాలజీలో ముందుకు  దూసుకుపోతున్న గూగుల్  వీడియో కాలింగ్ యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్ల కోసం తొలిసారిగా ఫేస్ టైం,స్కైప్ వంటి వాటికి ధీటుగా డియో యాప్ ని ఆవిష్కరించింది. మూడు నెలల ముందే ఈ యాప్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపిన గూగుల్ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. యాప్ ఎలా పనిచేస్తుంది  చూడము . 
ఇతరులను సులభంగా ఆహ్వానించేందుకు వీలుగా గూగుల్ కొత్త యాప్ 'డుయో' లో ఇంటర్ఫేస్ ను రూపొందించారు. త్వర  లో ప్రపంచము అంత రానుంది .
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకోసం రూపొందించిన 'డుయో' ను ఇండియాలో ప్రారంభించిన సంస్థ.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్:
భద్రత, గోప్యతలను కాపాడేందుకు వీలుగా అన్ని 'డుయో' కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇతర యూజర్ నేమ్, అకౌంట్ వంటివి అవసరం లేకుండానే యూజర్లు తమ ఫోన్ నెంబర్ తో ఈ వీడియో కాలింగ్ వాడుకోవచ్చు.
దీంతో పాటు డుయో యాప్ ద్వారా గూగుల్ 'నాక్ నాక్' పేరిట మరో కొత్త ఫీచర్ ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో కాలర్స్ సమాధానం ఇచ్చేందుకు ముందే.. కాల్ చేసినవారి లైవ్ వీడియో కనిపించే అవకాశం ఉంటుంది.
ఈ డుయో నెమ్మదిగా ఉండే నెట్వర్క్ ల్లో కూడా వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు గూగుల్ చెప్తోంది. అంతేకాక నెట్వర్క్ కనెక్షన్లకు అనుగుణంగా కాల్ క్వాలిటీ కూడా మారేట్టు డుయోను రూపొందించామని కంపెనీ చెబుతోంది.
దీనికి తోడు రిజల్యూషన్ కూడా తగ్గించుకొని మృదువుగా మాట్లాడుకునే అవకాశం డుయోలో ఉన్నట్లు గూగుల్ తెలిపింది.ఇది కాకుండా  డుయో వైఫై, సెల్యులార్ డేటాల మధ్య స్వయంచాలకంగా మారుతుందని, దీంతో వీడియో కాల్ మాట్లాడుతుండగా కట్ అయ్యే అవకాశం ఉండదని గూగుల్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ అమిత్ ఫూలే తెలిపారు.
ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ కమింగ్ సూన్ అని చూపిస్తోంది. అందులో కనిపించే ఫ్రీ రిజిష్టర్ లో మీరు రిజిస్టరయితే యాప్ ఓపెన్ కాగానే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.



గూగుల్ దేని వదలదు ఇపుడు ఏమి చేస్తోందో చూడండి..... గూగుల్ దేని వదలదు ఇపుడు  ఏమి చేస్తోందో  చూడండి..... Reviewed by Unknown on 23:00:00 Rating: 5
Powered by Blogger.